పురుగులమందు తాగి సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన రైతు నర్సింహులు మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి తదితరులను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన 13 కుంటల భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని నర్సింహులు మొరపెట్టుకున్నా.. అధికారులెవరూ పట్టించుకోనందునే ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు.
రైతు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతల అరెస్ట్ - arrest of congress leaders who went to see farmer dead body at siddipet
సిద్దిపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింహులు మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని.. వారిని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే నర్సింహులు మరణించాడని.. అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేశారు.

రైతు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతల అరెస్ట్
రైతు చనిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సంపత్ ప్రశ్నించారు. మృతుని కుటుంబాన్ని మంత్రి హరీశ్‌రావు ఆదుకోవాలని.. వారి కుటుంబానికి ఒక ఎకరం పొలం, రెండు లక్షల రూపాయల నగదు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:-యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!