తెలంగాణ

telangana

ETV Bharat / state

కోమటి చెరువు అందాల మధ్య.. బతుకమ్మ సంబురానికి సర్వం సిద్ధం - siddipet district news

బతుకమ్మ పండుగకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ తెలిపారు. అత్యంత వైభవంగా బతుకమ్మ సంబురం జరుపుకునేలా.. కోమటి చెరువును సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

Batukamma celebrations in siddipet district
అంబరాన్నంటే బతుకమ్మ సంబురం

By

Published : Oct 24, 2020, 8:57 AM IST

సిద్దిపేట జిల్లా కోమటి చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ పరిశీలించారు. తెలంగాణకు తలమానికంగా నిలిచిన బతుకమ్మ పండుగకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

అంబరాన్నంటే బతుకమ్మ సంబురం

బతుకమ్మ నిమజ్జనం చేసే దగ్గర గజ ఈతగాళ్లు, తాగునీరు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నివిధాలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణలోనే అత్యంత వైభవంగా సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారని చెప్పారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏసీపీ, సీఐలను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details