సిద్దిపేట పురపాలిక ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 1,640 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కరోనా నిబంధనలు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలోని 43 వార్డుల్లో 129 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో స్టేషన్‌లో ఎండతీవ్రత, కరోనా దృష్ట్యా తాగునీరు, టెంట్ సదుపాయం కల్పించామన్నారు.
'సిద్దిపేట పురపాలిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి '
సిద్దిపేట పురపాలిక ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. ఓటర్లు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఓటేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించినట్లు చెప్పారు.
సిద్దిపేట పురపాలిక ఎన్నికలు
ఇందూర్ కళాశాలలో ఉంచిన బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసినట్లు ముజామిల్ ఖాన్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ జోయల్ డేవిస్ కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి:'బొల్లారం ఆస్పత్రిలో కొవిడ్ సేవలు, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం'