తెలంగాణ

telangana

ETV Bharat / state

కొడుకు కోసమే తల్లి ప్రాణం! - కొడుకు కోసం నిత్యం ఓ వృద్ధురాలు బతుకు పోరాటం

చిన్నతనం నుంచే కదలలేని స్థితిలో ఉన్న కొడుకు కోసం నిత్యం ఓ వృద్ధురాలు బతుకు పోరాటం చేస్తోంది. దయార్ద్ర హృదయుల సాయంతో కాలం వెళ్లదీస్తున్నారు ఈ తల్లీకొడుకు.

siddipet District latest news
siddipet District latest news

By

Published : May 9, 2020, 3:14 PM IST

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్‌పల్లికి చెందిన చెట్కూరి అయిలవ్వ నడవలేని తన కొడుకు బీరయ్య ఆలనాపాలనా చూస్తోంది. మూడు చక్రాల కుర్చీలో కొడుకును ఐదు కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయం వద్దకు తీసుకెళ్తుంది. అక్కడికి వచ్చే భక్తులు దయతో ఇచ్చే డబ్బులతో గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛను మొత్తం మందులకు సరిపోవడం లేదని.. ఇతర ఆధారం లేకనే గుడి వద్దకు వస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్‌తో భక్తుల రాక లేకపోవటం వల్ల చేతిలో ఒక్కపైసా పడటం లేదని తల్లీకొడుకు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details