సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో కరోనాతో బాధపడుతున్న వృద్ధురాలు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు రోజుల క్రితం పాజిటివ్‌గా నిర్ధరణ కాగా... కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురి కాగా... ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
ఆ మండలంలో కరోనా తొలి కేసు.. తొలి మరణం ఒక్కరే...! - siddipet district news
కరోనాతో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందింది. అయితే తొలికేసుతో పాటు తొలిమరణం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.
ఆ మండలంలో కరోనా తొలి కేసు.. తొలి మరణం ఒక్కరే...!
తొలికరోనా కేసుతో పాటు తొలిమరణం ప్రజలను కలవరానికి గురిచేసింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే విషయామై గ్రామంలో అభ్యంతరాలు వ్యక్తం కాగా... కొంతమంది కుటుంబసభ్యుల సమక్షంలో మున్సిపల్ అధికారులు కరీంనగర్‌లోనే అంత్యక్రియలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!