తెలంగాణ

telangana

ETV Bharat / state

మండే ఎండకు అంబలి పంపిణీ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని (telangana formation day 2021) ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రారంభించారు.

ambali distribution program
మండే ఎండకు అంబలి పంపిణీ కార్యక్రమం

By

Published : Jun 2, 2021, 4:41 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో తెలంగాణ రాష్ట్ర అవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని(telangana formation day 2021) సిద్ధ రామేశ్వర, రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాటసారులకు అంబలి పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు.

మండే ఎండకు-కేసీఅర్ అంబలి అండ అనే నినాదంతో గత 10 ఏళ్లుగా టీటీడీ పాలక వర్గ సభ్యుడు మొరం శెట్టి రాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉచిత అంబలి వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హుస్నాబాద్​తోపాటు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, ముల్కనూర్ ప్రాంతాలతోపాటు దాదాపు 15-20 కేంద్రాల్లో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంబలి కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ గౌరవ సభ్యులు మోరం శెట్టి రాములుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పలువురు కోరారు.

ఇదీ చూడండి:Uttam: రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు

ABOUT THE AUTHOR

...view details