తెలంగాణ

telangana

ETV Bharat / state

సీజ్ చేసిన నగదును లాక్కెళ్లడం చాలా పెద్దనేరం: సీపీ జోయల్ డేవిస్ - Siddipeta CP Joel Davis press meet

దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల ఘటనలో తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ అన్నారు. ఉపఎన్నిక దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని సీపీ స్పష్టం చేశారు.

మాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: సీపీ జోయల్ డేవిస్
మాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: సీపీ జోయల్ డేవిస్

By

Published : Oct 27, 2020, 12:30 PM IST

Updated : Oct 27, 2020, 12:53 PM IST

ముందస్తు సమాచారంతోనే దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించామని... సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. మా సిబ్బందే డబ్బు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డబ్బు దొరికిన ఇంటి యజమానితో పాటు పంపించిన వ్యక్తి సంతకాలు కూడా తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేస్తున్నామన్న సీపీ... ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్కువమంది ఉండడం వల్లే డబ్బు లాక్కెళ్తున్నా అడ్డుకోలేకపోయామన్న సీపీ... ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇవీచూడండి:దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

Last Updated : Oct 27, 2020, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details