సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దుబ్బాక ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెరాస నుంచి సుజాత రామలింగారెడ్డి, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
ప్రధానంగా తెరాస, భాజపా నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం సాగించారు. సవాళ్లు, విమర్శలతో రాజకీయ వేడి పెంచారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కేడర్ సాయంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరు గెలుస్తారు? ఎంత ఆధిక్యం వస్తుందనే అంశమై అంతటా చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చదవండి:'ఏర్పాట్లు పూర్తయ్యాయి... ప్రశాంతంగా ఓటేయ్యండి'