తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం అధిక ధరలపై అఖిలపక్షం ధర్నా - మద్యం అధిక ధరలపై అఖిలపక్షం ధర్నా

మద్యం దుకాణాదారులు ఎమ్​ఆర్పీ రేటు కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని హుస్నాబాద్​లో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది.

మద్యం అధిక ధరలపై అఖిలపక్షం ధర్నా

By

Published : Oct 8, 2019, 9:38 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఆఫీస్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. హుస్నాబాద్​లోని వైన్ షాపుల యజమానులు ఎమ్ఆర్పీ రేటు కంటే అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైన్ షాపుల నిర్వాహకులను అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెపుతున్నారని వెల్లడించారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ విజయలక్ష్మిని సంప్రదించగా ఆమె అఖిలపక్ష నాయకులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

మద్యం అధిక ధరలపై అఖిలపక్షం ధర్నా

ABOUT THE AUTHOR

...view details