సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విపక్షాల ఆధ్వర్యంలో సిద్దిపేట-హన్మకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోళ్లు పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీంతో గంటసేపు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను శాంతింపజేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
సిద్దిపేట-హన్మకొండ రహదారిపై విపక్షాల ఆందోళన - కందుల కొనుగోలు చేయాలని ధర్నా
కందుల కొనుగోళ్లు పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యంలో సిద్దిపేట-హన్మకొండ రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

సిద్దిపేట-హన్మకొండ రహదారిపై విపక్షాల ఆందోళన
వ్యవసాయ మార్కెట్ కందుల కొనుగొళ్లు నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విపక్ష నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి దళారుల నుంచి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సిద్దిపేట-హన్మకొండ రహదారిపై విపక్షాల ఆందోళన
ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'