సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో సంపూర్ణంగా మద్యంపై నిషేధం విధిస్తూ గ్రామ సర్పంచ్, పంచాయితీ సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఇక మీదట గ్రామంలో బహిరంగంగా మద్యం త్రాగడం, విక్రయించడం చేస్తే 50,000 రూపాయల జరిమాన విధిస్తామని గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ వెల్లడించారు. మద్యపానం వల్ల కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దీనికి పోలీసులు, ప్రభుత్వ సహకారం కూడా కోరామని వెల్లడించారు.
పందిళ్లలో మద్యపాన నిషేధం - మా ఊళ్లో మద్యం వద్దు...
సిద్దిపేట జిల్లా పందిళ్ళ గ్రామంలో సపూర్ణ మద్యపానం నిషేధించాలని ఆ గ్రామ పంచాయతీ తీర్మానించింది.
మా ఊళ్లో మద్యం వద్దు...