సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో సంచరిస్తున్న పందులను కొందరు ప్రైవేటు వ్యక్తులు తమకు తెలియకుండానే పట్టుకుపోతున్నారంటూ ఎరుక కులస్థులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ జీవనాధారమైన పందులను పట్టుకెళ్తే తాము ఎలా బతకాలంటూ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని నిలువరించారు. కాగా తాము ఇదివరకే దుబ్బాక మున్సిపాలిటీలో కుక్కలు, పందులు, గాడిదలు నిలువరించాలని ఆదేశాలు జారీ చేశామని... అయినా పందులను తొలగించకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులచే పట్టిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య వివరించారు.
పందుల కోసం ఆందోళన... ఆత్మహత్యాయత్నం - దుబ్బాక మున్సిపాలిటీ కేంద్రం
తమ పందులను ఎత్తుకెళుతున్నారని వాపోతూ... బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఎరుక కులస్తులు ఆందోళనకు దిగారు.

మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఎరుకల ఆందోళన