సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్బి) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్బీ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థి నాయకులు మొక్కలు నాటారు. విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్న ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ ఆవిర్భవించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఆ సందర్భంగా పదివేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఐదు వేల మొక్కలు నాటామని.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నామని ఆయన తెలిపారు.
ఏఐఎస్బీ ఆవిర్భావం సందర్భంగా మొక్కలు నాటిన విద్యార్థి నాయకులు - సిద్ధిపేట జిల్లా వార్తలు
ప్రకృతిని కాపాడకపోతే మానవ జాతి మనుగడకు చాలా ప్రమాదమని ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. సంఘం ఆవిర్భవించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిద్ధిపేట జిల్లా కొహెడ మండలంలో ఏఐఎస్బీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు.

మొక్కలు నాటడం మనందరి సామాజిక బాధ్యత అని.. ప్రకృతిని కాపాడకపోతే రానున్న రోజులలో మానవజాతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు రెండు మొక్కలు నాటి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరూ భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి నాయకులు సయ్యద్ మహబూబ్, చిలకమారి రాకేష్ ,గవ్వ అరవింద్ రెడ్డి, దానబోయిన మహేందర్, చాడ వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి, చోటు, సతీష్, ప్రవీణ్ రెడ్డి, చాడ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!