తెలంగాణ

telangana

ETV Bharat / state

వైమానిక దళ నియామక ప్రక్రియ - gajwel

భారత వైమానిక దళ నియామక ప్రక్రియ సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ప్రారంభమైంది. అభ్యర్థులకు విడతలవారీగా పరుగు పందాలు నిర్వహించారు.

వైమానిక దళ నియామక ప్రక్రియ

By

Published : Feb 26, 2019, 3:32 PM IST

వైమానిక దళ నియామక ప్రక్రియ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత వైమానిక దళ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 జిల్లాలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విడతలవారీగా పరుగు పందాలు నిర్వహించి ఇందులో నెగ్గిన వారికి మరిన్ని పరీక్షలు పెడుతున్నారు.
దశల వారీగా...
ఉదయం 5 గంటలకు వచ్చిన వారికి స్టాంప్ వేసి మొదటి విడత పరుగు పందెం నిర్వహించారు. ఇందులో నెగ్గిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను చేపట్టారు. అనంతరం దేహ ధారుడ్య పరీక్షలు నిర్వహించారు.

తగిన ఏర్పాట్లతో...
గజ్వేల్​ పట్టణంలో జరుగుతున్న వైమానిక దళనియామక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details