సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో పోలీసుల పక్షపాత వైఖరి, అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. భాజపా, తెరాస డబ్బులతోనే గెలవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలను.. తెరాస విచ్చలవిడిగా పంచుతోందని ఆరోపించారు.
దుబ్బాకలో పోలీసులది పక్షపాత వైఖరి: దాసోజు శ్రవణ్ - dasoju sravan allegations on police
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో పోలీసుల పక్షపాత వైఖరి, అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు.
దుబ్బాకలో పోలీసులది పక్షపాత వైఖరి: దాసోజు శ్రవణ్
ఇప్పటివరకు అధికార పార్టీకి చెందిన ఒక్క రూపాయ పట్టుకోలేదని పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ఓ పార్టీ అభ్యర్థి బంధువుల ఇంట్లో పోలీసులే డబ్బులు పెడుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయని తెలిపారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీసులతో దుబ్బాక ఉపఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.