సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోసు రాజు స్పష్టం చేశారు. రాయపోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
'ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడదాం' - దుబ్బాక ఉపఎన్నికలు
తెరాస, భాజపా ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రజలకు వివరించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోసు రాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
'ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడదాం'
ఈనెల 15న మధ్యాహ్నం రెండు గంటలకు తమ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
ఇవీచూడండి:కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ఉత్తమ్