సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు జరుగుతున్న తీరుతెన్నులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. మంత్రి వెంట అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి - agriculture minister niranjanreddy
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి తనిఖీ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి