రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ కారణంగా మందుబాబులు ముందు జాగ్రత్తగా మద్యం దుకాణాల ఎదుట మద్యం కోసం బారులు తీరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల వద్ద భౌతిక దూరం మరచి గుంపులు గుంపులుగా చేరారు.
గత సంవత్సరం లాక్డౌన్ విధించినప్పుడు మద్యం దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డ మందుబాబులు.. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేశారు. ముందు జాగ్రత్తతో వారం, పది రోజులకు సరిపడా మద్యం సీసాలను కొనుక్కుని వెళుతున్నారు.