తెలంగాణ

telangana

ETV Bharat / state

కోతుల భయంతో... - SIDDIPET

కోతులు... ఇవి చేసే పనులు చూసి నవ్వుకుంటాం. కొంతమందికి ఎక్కడ కరుస్తాయో అనే భయం కూడా ఉంటుంది. ఆ భయమే సిద్దిపేట జిల్లాలో ఓ వృద్ధురాలి చావుకు కారణమైంది.

కోతుల భయంతో...

By

Published : Feb 25, 2019, 1:43 PM IST

Updated : Feb 25, 2019, 3:08 PM IST

వృద్ధురాల్ని బలిగొన్న కోతులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పందిల్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రమ్మ అనే మహిళ ఇంట్లో కుర్చోని ఉండగా ఆకస్మాత్తుగా కోతుల గుంపు వచ్చింది. అది చూసి భయపడిన వృద్ధురాలు తప్పించుకునే ప్రయత్నం చేసింది. ప్రమాదవశాత్తు గుంతలో పడింది. తలకు బలంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కోతులను వెళ్లగొట్టి.. ఆ వృద్ధురాలిని వరంగల్‌ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది.

గ్రామస్థులఆందోళన:

గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Last Updated : Feb 25, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details