సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట, గొల్లకుంట గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను అదనపు డీజీపీ (సీఐడీ) గోవింద్‌సింగ్ తనిఖీ చేశారు. అంతక్కపేటలోని వీధుల్లో తిరుగుతూ.. పారిశుద్ధ్యం, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. డంపింగ్ షెడ్లు, వైకుంఠదామాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పల్లెప్రగతి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, నర్సరీని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు వయసుకు తగిన బరువు ఉన్నారా లేదా అని స్వయంగా తూకం వేసి తెలుసుకున్నారు.