సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యటించారు. కరోనా వ్యాధి సోకిన వారి కుటుంబాలను సందర్శించి వారికి ధైర్యం చెప్పారు. పట్టణంలో పలువురు మహమ్మారి బారిన పడినందున పట్టణ ప్రజలెవరూ భయబ్రాంతులకు గురికావొద్దని, తగు జాగ్రత్తలు పాటించినట్లయితే వ్యాధి సోకదని ఆయన సూచించారు.
కరోనా బాధిత కుటుంబాలకు అదనపు కలెక్టర్ భరోసా
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కరోనా వ్యాధి బారిన పడిన కుటుంబాలకు జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ధైర్యం చెప్పారు. వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
కరోనా వ్యాధిగ్రస్త కుటుంబాలకు అదనపు కలెక్టర్ భరోసా
ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దీపక్ తివారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లీశ్వరి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, తిమ్మాపూర్ మెడికల్ అధికారి డాక్టర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు