సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వ్యాధిపై జాగ్రత్తలు సూచించడమే కాకుండా ధైర్యంగా పనిచేయాలని, ఇప్పుడున్న పరిస్థితులలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ విభాగాల సిబ్బంది పని చేయడం అత్యవసరమని ఆయన తెలిపారు.
'ప్రజలందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది' - సిద్దిపేట జిల్లా తాజా వార్త
కరోనా గడ్డుకాలంలో ప్రజలందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ రెవెన్యూ విభాగాలవారిపై ఉందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. దుబ్బాక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా ఆయన సందర్శించారు.
'ప్రజలందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది'
కరోనాకు ఇతరులు భయపడకుండా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి, డాక్టర్ హేమరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'