సిద్ధిపేట జిల్లా కేంద్రం పాత బస్టాండ్ సర్కిల్లో మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న ఆరుగురికి అడిషనల్ కలెక్టర్ ముజంమీల్ ఖాన్ జరిమానా విధించారు. రూ.500 నుంచి 1000 రూపాయల చొప్పున మొత్తం రూ.2100 వసూలు చేశారు. మరోసారి అనవసరంగా రోడ్లపై తిరగొద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.
మాస్క్‌లు ధరించలేదని జరిమానా విధించిన అడిషనల్ కలెక్టర్ - siddipet district latest news today
సిద్దిపేటలో ముఖానికి మాస్కులు లేకుండా బయటకొచ్చిన ఆరుగురికి అడిషనల్ కలెక్టర్ ముజంమీల్ ఖాన్ రూ.2100 జరిమానా విధించారు. మాస్కులు లేకుండా బయట తిరగొద్దని సూచించారు.
మాస్క్‌లు ధరించలేదని జరిమానా విధించిన అడిషనల్ కలెక్టర్
మాస్కులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి, దుకాణం వద్ద భౌతిక దూరం పాటించని వారికి, మాస్కులు ధరించని యజమానులకు జరిమానాలు విధించినట్లు ఆయన చెప్పారు. ఏవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి :ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్