సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట సమీపంలో ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. అంతకపేటకు చెందిన బోనగిరి శ్రీనివాస్(30) తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 23న పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఆ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా.. అతని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
'సీసీ కెమెరా ఫుటేజీ నిందితుడిని పట్టించాయి' - సిద్దిపేట జిల్లా లేటెస్ట్ వార్తలు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట సమీపంలో ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలంలో ఓ వాహనానికి సంబంధించిన హెడ్‌లైట్ లభించగా.. స్వాధీనం చేసుకొని పరిసర గ్రామాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. వాటి ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు.
సీసీ కెమెరాలపై ఏసీపీ మహేందర్ మీడియా సమావేశం
ఘటనా స్థలంలో ఓ వాహనానికి సంబంధించిన హెడ్‌లైట్ లభించగా.. స్వాధీనం చేసుకొని పరిసర గ్రామాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. వాటి ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనం కోహెడ మండలం రామచంద్రాపురానికి చెందిన డీసీఎం వ్యాన్‌గా గుర్తించి, యజమాని బొలుమల్ల రవీందర్‌ను అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ రవి, కానిస్టేబుళ్లు శ్రవణ్‌కుమార్, రమేశ్, హఫీజ్‌ను అభినందించారు.
ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి