సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీపీ జోయల్ డేవిస్ ఆదేశానుసారం ఏసీపీ మహేందర్, పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
పోలీస్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు - husnabad cp joel davis
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ టెస్టులు చేయిస్తున్నట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు.
పోలీస్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని ఏసీపీ మహేందర్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని ఏసీపీ సూచించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:'దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు నిరాధారం'