తెలంగాణ

telangana

ETV Bharat / state

'చట్టాలపై విద్యార్థులకు అవగాహన' - అవగాహన

సమాజంలో ఏ విధంగా జీవించాలో, నడుచుకోవాలో విద్యార్థులకు ముందే అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో ముందుకెళ్తారని ఏసీపి మహేందర్ పేర్కొన్నారు.

By

Published : Aug 14, 2019, 1:35 PM IST

సిద్దిపేట జిల్లా అంతకపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్కన్నపేట పోలీసులు విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఏసీపీ మహేందర్, ఎస్ఐ పాపయ్య సమాధానాలు చెప్పారు. వివిధ చట్టాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏసీపి మహేందర్ పేర్కొన్నారు.

'చట్టాలపై విద్యార్థులకు అవగాహన'

ABOUT THE AUTHOR

...view details