తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట జిల్లా గౌరవెల్లి పంప్‌హౌస్‌ పనుల్లో అపశ్రుతి - సిద్దిపేట జిల్లా వార్తలు

accident at gouravelli pump house at siddipet district
సిద్దిపేట జిల్లా గౌరవెల్లి పంప్‌హౌస్‌ పనుల్లో అపశ్రుతి

By

Published : Aug 12, 2020, 3:46 PM IST

Updated : Aug 12, 2020, 5:59 PM IST

15:45 August 12

సిద్దిపేట జిల్లా గౌరవెల్లి పంప్‌హౌస్‌ పనుల్లో అపశ్రుతి

సిద్దిపేట జిల్లా గౌరవెల్లి పంప్‌హౌస్‌ పనుల్లో అపశ్రుతి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ వద్ద జరుగుతున్న గౌరవెల్లి పంప్​హౌస్​ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పంప్ హౌస్ పనుల్లో భాగంగా సొరంగంలో ఉట నీటిని బయటికి పంపే పైప్​లైన్లు ప్రమాదవశాత్తు పేలిపోయాయి. కింద పనిచేస్తున్న కార్మికులపై ఆ పైపులు పడ్డాయి. 

ఈ ఘటనలో వరంగల్​కు చెందిన వంగ రమేశ్​ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి:కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి

Last Updated : Aug 12, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details