తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరు​ లారీ కింద పడి ఇద్దరు మృతి - బోరు లారీ

ప్రమాదవశాత్తు బోరు లారీ కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దూదేకులపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

accident at cheryala in siddipeta district
బోరు​ బండి కింద పడి ఇద్దరు మృతి

By

Published : Apr 19, 2020, 8:03 PM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దూదేకులపల్లిలో గొట్టం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద బోరు వేయడానికి నిన్న రాత్రి బోరు​ బండి వచ్చింది. బోరు వేసిన అనంతరం ఇద్దరు కూలీలు నిద్రించడానికి లారీ కిందకు వెళ్లారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో డ్రైవర్ బండిని వెనకకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు బండి కింద నిద్రిస్తున్న ఛత్తీస్​ఘడ్​కు చెందిన పోయామి లక్ష్మణ్(22), ఆలం విజయ్(19)పై నుంచి వెళ్లింది. వారు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details