తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి హరీశ్​రావు ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం - మంత్రి హరీశ్ రావు ఇంటి వద్ద ఏబీవీపీ నాయకుల ఆందోళన

పెండింగ్ స్కాలర్​షిప్​లు, ఫీజు రియంబర్​మెంట్స్​ను వెంటనే విడుదల చేయాలని... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు మంత్రి హరీశ్ రావు ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు.

ABVP leaders protest at minister harish rao house
మంత్రి ఇంటిని మట్టడించేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం

By

Published : Mar 5, 2020, 5:14 PM IST

సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు ఇంటిని ఏబీవీపీ నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పెండింగ్​ స్కాలర్​షిప్​లు, ఫీజు రియంబర్​మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

మంత్రి ఇంటిని మట్టడించేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం

ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండివైఖరిని అవలంభిస్తోందని వారు ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి:'మినరల్ వాటర్​ కన్న... మిషన్ భగీరథ నీళ్లు మిన్న'

ABOUT THE AUTHOR

...view details