తెలంగాణ

telangana

దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

By

Published : Mar 13, 2020, 12:04 AM IST

తమకు రూ.10వేల వేతనం చెల్లించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు శాంతియుత ధర్నాకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aasha workers protest in dubbaka for salary
దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆశా వర్కర్లు గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. హైదరాబాద్​లోని హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు శాంతియుత ధర్నాకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.10 వేల వేతనం ఇస్తుందని.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వీరి నిరసనకు సీఐటీయూ మద్దతు తెలిపింది.

దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

ABOUT THE AUTHOR

...view details