తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నీతానై తల కొరివి పెట్టిన భార్య - భర్త అంత్య క్రియలు నిర్వహించిన భార్య

ఏడడుగులు నడిచిన భార్య అన్నీ తానై భర్త అంతిమ యాత్రలో పాల్గొంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు లాక్​డౌన్​ వల్ల తండ్రికి తలకొరివి పెట్టడానికి రాలేని పరిస్థితిలో... భర్తకు అంత్య క్రియలు నిర్వహించింది. పొంగుకొస్తున్న దుఖం దిగమింగుకుని చితికి నిప్పుపెట్టింది.

a wife who held the husbend funeral
అన్నీతానై తల కొరివి పెట్టిన భార్య

By

Published : Apr 12, 2020, 7:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్లకు చెందిన వెల్దండి రాములు నిన్న అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఉపాధి కోసం గుజరాత్ వెళ్లిన ఒక్కగానొక్క కొడుకు లాక్​డౌన్​ కారణంగా తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేని పరిస్థితి.

భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వలేక రోదిస్తున్న మృతుడి భార్య లసులమ్మ కన్నీరు... చూపరుల హృదయాలను కలిచివేసింది. కొందరు ముందుకొచ్చి తలాకొంత వేసుకుని ఆమెతో తలకొరివి పెట్టించారు. తండ్రి చివరి చూపు నోచుకోని మృతుని కుమారుడు కనకయ్య లైవ్​ వీడియోలో తండ్రి అంతక్రియలు చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇదీ చదవండి:ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!

ABOUT THE AUTHOR

...view details