సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో రాత్రి పూట పలు దొంగతనాలకు పాల్పడుతున్న రామకృష్ణ అలియాస్ జంపయ్య అనే వ్యక్తిని గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 31 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.1 లక్షా 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేటకు చెందిన రామకృష్ణగా పోలీసులు గుర్తించారు.
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - latest crime news in siddipet
సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లి చెడు అలవాట్లకు బానిసై దొందతనాలకు పాల్పడుతున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. గజ్వేల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు రామకృష్ణను విచారించగా, చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు సీపీ వెల్లడించారు.
ఇవీ చూడండి : బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ