సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని టీచర్స్ కాలనీలో సోమవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. పట్టణంలో నివాసముంటున్న డాక్టర్ మురళి కృష్ణ 3 రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సోమవారం ఇంటి తలుపులు విరిగినట్లు చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిశీలించి ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించారు. 16 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను దొంగలు అపహరించుకొని వెళ్లినట్లు యజమాని తెలిపారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ పరిశీలించారు. క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ నమూనాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. వరుస దొంగతనాలతో పట్టణవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
హుస్నాబాద్‌లో వరుస దొంగతనాలు - హుస్నాబాద్
వరుస దొంగతనాలు హుస్నాబాద్ వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం టీచర్స్ కాలనీలో చోరీ జరిగింది. సుమారు 16 తులాల బంగారం, కిలో వెండిని తస్కరించారు.
సిద్దిపేట