తన కుటుంబ సభ్యులు డబ్బుకోసం తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని... తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సోమేశ్ తన కుటుంబ సభ్యులు తనపై కేసు పెట్టారని.. తన భార్యను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌టవర్ ఎక్కాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్, గజ్వేల్ జడ్పీటీసీ మల్లేశం ఘటనా స్థలికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలతో సోమేశ్ కిందకి దిగొచ్చాడు.
కుటుంబ కలహాలతో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు - A young man climbing a cell tower in Siddipet to commit suicide
కుటుంబ కలహాలతో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్చల్ చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది.
![కుటుంబ కలహాలతో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5164335-thumbnail-3x2-cell-rk.jpg)
ఆత్మహత్య చేసుకుంటానంటూ సిద్దిపేటలో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
తన తండ్రి పిసప్ప, పిన తల్లి యాదమ్మలు ఆస్తి కోసం తనను హత్యచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించాడు. తప్పుడు కేసుతో అరెస్టుచేయిస్తున్నారని వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు.
ఆత్మహత్య చేసుకుంటానంటూ సిద్దిపేటలో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
ఇదీ చూడండి: అపార్ట్‌మెంట్ లిఫ్ట్ కింద పడి బాలుడు మృతి