ప్రజారోగ్య రక్షణకు పారిశుద్ధ్య కార్మికులు ఎంత తీవ్రంగా శ్రమిస్తారో ఆ చిత్రం అద్దంపడుతోంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో మురుగు నీటి పారుదల వ్యవస్థ స్తంభించింది. భూగర్భ మురుగు కాలువ శుభ్రం చేసేందుకు కార్మికులు అవస్థలు పడ్డారు.
పారిశుద్ధ్య కార్మికుని శ్రమకు నెటిజన్లు ఫిదా - Siddipet district latest news
పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని నిరుపించాడు సిద్దిపేట జిల్లాకు చెందిన కార్మికుడు. ఇతని వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికుని శ్రమకు ఫిదా అయిన నెటిజన్లు
తోటి కార్మికుడు మహేష్‌ను యాదగిరి తలకిందులుగా మ్యాన్‌హోల్‌లోకి దించారు. ప్రాణాలు అరచేత పట్టుకొని అతను చెత్తాచెదారాన్ని తొలిగించారు. ఎంతో శ్రమకోర్చి మురికి కాలవలో తలదూర్చి స్వచ్ఛతకు పాటుపడిన కార్మికులకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి
ఇదీ చదవండి:మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు