సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వినాయక శోభయాత్ర ఘనంగా జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని విద్యుత్ వెలుగుల మధ్య ఊరేగించారు. చిన్నారుల కేరింతలు, యువత నృత్యాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, భక్తుల భజనలతో గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువుల వద్ద ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
గజ్వేల్లో ఘనంగా వినాయక శోభాయాత్ర - ganesh immration
తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు. డప్పు చప్పుళ్లు, భక్తుల భజనలతో శోభాయాత్ర నిర్వహించారు.
వినాయక శోభాయాత్ర