కొబ్బరి కుడకల కోసం అమ్మవారి ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల సమీపంలో జరిగింది. గ్రామంలోని పోచమ్మ ఆలయంలోకి శుక్రవారం రాత్రి సమయంలో భల్లూకం ప్రవేశించింది.
పోచమ్మ ఆలయం గర్భగుడిలో భల్లూకం... ఎందుకు వెళ్లిందంటే - పోచమ్మ ఆలయంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల సమీపంలోని పోచమ్మ ఆలయం గర్భగుడిలోకి ఎలుగుబంటి చొరబడింది. శుక్రవారం రాత్రి కొబ్బరి కుడుకల కోసం లోనికి వెళ్లిన భల్లూకాన్ని చూసిన ఓ రైతు దాన్ని లోపలపెట్టి ద్వారానికి తాళం వేశాడు.
పోచమ్మ ఆలయం గర్భగుడిలోకి వెళ్లిన భల్లూకం... ఎందుకంటే
దాన్ని గమనించిన ఓ రైతు... ఎలుగుబంటిని లోపల పెట్టి ద్వారం మూసివేసి తాళం వేశాడు. అటవీ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ అధికారుల సమాచారంతో శనివారం సాయంత్రం రెస్క్యూ బృందం చేరుకుంది. పశువైద్యుడు తుపాకీ ద్వారా మత్తు ఇంజెక్షన్ వేయగా మత్తులోకి జారుకున్న ఎలుగుబంటిని పట్టుకుని... అడవిలో వదిలిపెట్టేందుకు వరంగల్‌కు తరలించారు.
ఇదీ చదవండి:దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్