సిద్దిపేట పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం వరకు 67.08 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను పట్టణ శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి భద్రపరిచారు.
సిద్దిపేట పురపాలికలో 67.08 శాతం పోలింగ్ నమోదు - Siddipet municipality elections news
సిద్దిపేట పురపాలక ఎన్నికల్లో 67.08 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా విలయతాండవంలోనూ ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Siddipet municipality polling details
కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించారని.. అధికారులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అభినందించారు. మరోవైపు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలికలోని 12 వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో 74.26 శాతం పోలింగ్ నమోదైంది.