కిడ్నీలో 45 రాళ్లు.. తొలగించిన వైద్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన హనుమంతు (70) రెండు, మూడేళ్ల నుంచి మూత్రకోశంలో రాళ్లతో ఇబ్బందులకు గురయ్యాడు. ఇటీవల సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు స్కానింగ్ చేశారు. అందులో మూత్రకోశంలో నలభై ఐదు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. యూరాలజిస్ట్ జగదీశ్వర్ వాటిని తొలగించేందుకు క్యాటర్ పైపు వేసి ప్రయత్నించారు. మూత్రకోశం మొత్తం రాళ్లు నిండి ఉండటంతో పైపు వేసిన ప్రయోజనం లేక ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ శంకర్ రావు తెలిపారు. ఒక రాయి ఉంటేనే విపరీతమైన కడుపునొప్పి వస్తుంది.. అలాంటిది అతనికి 45 రాళ్లు నిండిపోయి ఉన్నాయన్నారు. ఇలాంటి నొప్పి వస్తే సరైన వైద్యుడిని సంప్రదించాలని శంకర్ రావు పేర్కొన్నారు.