'దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది' - దుబ్బాక మున్సిపల్ ఎన్నికలు
దుబ్బాకలో రెండో రోజు 34 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. శుక్రవారం మిగతా వార్డుల్లో దాఖలు చేయనున్నారు. అన్ని వార్డుల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి అన్నారు.

'దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది'
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో రెండో రోజు 34 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థిగా ఇస్తారుగల్ల కవిత, 14వ వార్డుకు ఇస్తారుగల్ల చరణ్ తేజ, 10వ వార్డుకు ఎండీ సలీం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి జరిగినందున మరోసారి అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
'దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది'
- ఇవీ చూడండి: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం