తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో కరోనా కలకలం.. ఒకే రోజు 3 కేసులు - Siddipet corona updates

సిద్దిపేట జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఒకేరోజు మూడు మండలాల్లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Siddipet corona
Corona in siddipet

By

Published : Jun 11, 2020, 11:37 PM IST

సిద్దిపేట జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుంది. ఒకే రోజు మూడు పాజిటివ్ కే సులు నమోదు అయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కొంత కాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని ఎంఎన్​జే క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది.


తోగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన యువకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. యువకుడు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్​లోని యశోదా ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడ డబ్బులు ఎక్కువ అవుతున్నాయని గాంధీ ఆస్పత్రికి వెెెెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు చేశారు. పాజిటివ్ రాగా.. యువకుడి స్వగ్రామం గుడికందులకు తరలించి హోమ్ క్వారంటైన్ చేశారు.

దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన వృద్ధుడు కొంత కాలం క్రితం డయాలిసిస్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో 9 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. అక్కడి నుంచి హైదరాబాద్​లని నిమ్స్​కు తరలించారు. అనుమానం వచ్చిన వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది.

దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగిన తరుణంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైద్యాధికారులు ప్రభుత్వాధికారులు నియోజకవర్గంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

చూడండి: నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టుకు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details