సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామంలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం అందించారు. పునరావాసం, పునర్ ఉపాధి కల్పన ప్యాకేజీ కింద 570 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి రూ.7లక్షల 50 వేలు చెక్కుతో పాటు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నిర్మాణ ధ్రువ పత్రాన్ని అందజేశారు. ఇంటి నిర్మాణం వద్దనుకుంటే ఖాళీ స్థలం ధ్రువపత్రంతో పాటు రూ.ఐదు లక్షల చెక్కులను ఇచ్చారు. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు 5 లక్షల పరిహారం, 250 గజాల స్థల ధ్రువపత్రాన్ని పంపిణీ చేశారు.
ఎలాంటి ఉద్యమం చేయకుండా మల్లన్న సాగర్ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, తమకు అందరికంటే తక్కువ పరిహారం వచ్చిందని రైతులు వాపోయారు.
మల్లన్న సాగర్ పరిహారంపై రైతుల అసంతృప్తి - pallepahad village
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. నిర్వాసితులందరికీ నగదుతో పాటు ఇంటి ధ్రువపత్రాన్ని అందించారు. ఇల్లు వద్దనుకున్న వారికి ఖాళీ స్థలంతో పాటు రూ.5 లక్షల నగదు అందించారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం
ఇవీ చూడండి: నేటి నుంచి తెలంగాణలో భాజపా ఓదార్పుయాత్ర