తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిద్దిపేటను సమగ్ర అభివృద్ధి చేస్తాం : హరీశ్​రావు - MITTAPALLI PRACHARAM

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలంలో మాజీ మంత్రి హరీశ్​రావు పర్యటించారు. తెరాస అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో హరీశ్​రావు

By

Published : May 4, 2019, 12:38 AM IST

సిద్దిపేట అంటే గోదావరి జలాలు, పరిశ్రమలు, రైల్వే స్టేషన్, జాతీయ రహదారి, ఉద్యోగ ఉపాధి అనే విధంగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లిలో ప్రచార సభ నిర్వహించారు. నెల రోజుల తర్వాత పెంచిన పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేటకు కాలుష్యం లేని కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దసరా నాటికి గోదావరి నీటిని రంగనాయక సాగర్​కు తెప్పిస్తామని పేర్కొన్నారు. తెరాస అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఎన్నికల ప్రచారంలో హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details