తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 20 మందికి పాజిటివ్‌ - సిద్దిపేట జిల్లా వార్తలు

Corona Cases in gurukul school: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాలలో 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కరోనా
కరోనా

By

Published : Aug 1, 2022, 6:44 PM IST

Corona Cases in gurukul school: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం పాఠశాలలో జ్వరంతో ఉన్న విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయగా.. మొదట ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధనా, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్‌ టెస్టులు చేశారు.

ఇందులో 16 మంది విద్యార్థినులకు, ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లకు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన 16 మంది విద్యార్థినులను ఇళ్లకు పంపిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details