సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుకునూర్‌పల్లిలో వివాహానికని ద్విచక్రవాహనంపై వెళ్తున్న నలుగురిని కరీంనగర్ నుంచి గజ్వేల్ వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్ రెడ్డి, అతని తమ్ముడి కుమార్తె సౌమ్య అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ఉన్న కవిత ఆమె కుమార్తె శ్రీవిద్యకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీవిద్య పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు. బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చనిపోవడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
పెళ్లికి వెళ్తుండగా ఘోరం..ఇద్దరు దుర్మరణం.. - ACCIDENT
పెళ్లికని బయలుదేరిన వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
బొలెరో వాహన రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు