మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే మండలాల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో మూడో విడత జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికలు జరిగే జహీరాబాద్,మొగుడం పల్లి, ఝరాసంగం, కోహిర్, మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పెద్ద ఎత్తున నామ పత్రాలను ఉపసంహరించుకున్నారు. చివరి రోజు మూడు గంటల వరకు సమయం మిగిలి ఉండడం వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల అభ్యర్థనల మేరకు పోటీ నుంచి తప్పుకునేందుకు సుముఖత చూపుతూ ధరావతు వాపస్ తీసుకున్నారు. రిటర్నింగ్ కార్యాలయానికి అభ్యర్థులు భారీ ఎత్తున తరలిరావడం వల్ల మండల పరిషత్ కార్యాలయంలో సందడి నెలకొంది. బరిలో మిగిలిన అభ్యర్థులకు రాత్రి వరకు గుర్తులు కేటాయించనున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ - ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
మూడో విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. జహీరాబాద్ డివిజన్లోని వివిధ మండలాల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కొందరు నామపత్రాలను ఉపసంహరించుకున్నారు.
ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ