తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల బాధ్యత' - Sangareddy District Latest News

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి సర్వసభ్య సమావేశంలో జడ్పీ ఛైర్​పర్సన్ మంజుశ్రీ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల బాధ్యతని అన్నారు. పల్లె ప్రకృతి వనంలో జడ్పీటీసీ అరుణ మోహన్ రెడ్డితో కలిసి మొక్క నాటారు.

మొగుడంపల్లీ సర్వసభ్య సమావేశంలో జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ
మొగుడంపల్లీ సర్వసభ్య సమావేశంలో జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ

By

Published : Mar 17, 2021, 8:35 PM IST

గ్రామాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల బాధ్యతని సంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ మంజుశ్రీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలోని మొగుడంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. సభ్యులు లేవనెత్తిన అంశాలు, సమస్యలు తక్షణం పరిష్కరించి అధికారులు జవాబుదారిగా పని చేయాలని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనంలో భర్త జైపాల్ రెడ్డి, జడ్పీటీసీ అరుణ మోహన్ రెడ్డితో కలిసి మొక్క నాటారు.

ఇదీ చూడండి:'నిరుద్యోగ భృతి ఇచ్చేదెన్నడు.. అభివృద్ధి జరిగేదెన్నడు?'

ABOUT THE AUTHOR

...view details