పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్(BB Patil) స్పందించారు. తాను తెరాసను వీడి భాజపాలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కొన్ని మీడియా ఛానళ్లు, పేపర్లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి లీగల్ నోటీసులు ఇస్తానని తెలిపారు.
BB Patil: నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు: ఎంపీ బీబీ పాటిల్ - ఎంపీ బీబీ పాటిల్ వార్తలు
తాను తెరాసను వీడి భాజపాలో చేరుతున్నానని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్(BB Patil) తెలిపారు. కొన్ని మీడియా ఛానళ్లు, పేపర్లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి లీగల్ నోటీసులు ఇస్తానని తెలిపారు.

ఎంపీ బీబీ పాటిల్
తెరాసతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెరాసలో ఎవరితోనూ విభేదాలు లేవని, ఎమ్మెల్యేలందరీతో సమన్వయంతో పని చేస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. అసత్య ప్రసారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు.
ఇదీ చదవండి:Film chamber: షూటింగ్ స్పాట్లో ఈ నిబంధనలు పాటించాల్సిందే..