గల్లీలో కుస్తీ దిల్లీలో దోస్తీ అన్నట్లు తెరాస భాజపా మైత్రి బంధం కొనసాగుతోందని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్(manickam tagore) ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష(Zaheerabad parliament Mandal Congress Presidents meeting) సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ దామోదర రాజనర్సింహ, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు నియోజకవర్గాలు బ్లాక్ స్థాయి మండలాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సలహాలు స్వీకరించారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
నాటాకాలాడుతున్నారు..
రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తెరాస, భాజపా పరస్పర విమర్శలు చేస్తూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపాయేతర ముఖ్యమంత్రిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్న ప్రధాని మోదీ తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR)పై మాత్రం ఒక్క కేసూ నమోదు చేయకపోవడం విడ్డూరమని అన్నారు.