ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెచ్చిస్తోందని ఎమ్మెల్యే మాణిక్ రావు పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో చేపడుతోన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తమ ప్రాంతానికి రోడ్డును మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. గాంధీనగర్లో చేపడుతోన్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
![సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే zaheerabad mla manik rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:12:52:1619606572-tg-srd-26-28-mla-started-cc-road-work-av-ts10059-28042021160639-2804f-1619606199-120.jpg)
zaheerabad mla manik rao
కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ.. మహమ్మారి కట్టడికి తమ వంతు బాధ్యత వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'ప్రభుత్వ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'